Wedding : చిన్ననాటి స్నేహితుడితో సౌత్ స్టార్ హీరోయిన్ పెళ్లి

wedding

wedding

Heroine Wedding :  సౌత్ స్టార్ హీరోయిన్ త్వరలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోనుంది. కాబోయే భర్త ఆమె చిన్నాటి  స్నే్హితుడు ఆంథోనీ అథిల్ అని సమాచారం. వీరిద్దరూ చాలా కాలంగా  ప్రేమలో ఉన్నారని మాలీవుడ్ లో టాక్ ఉంది. అయితే ఈ వివాహాన్ని కీర్తి సురేష్ లేదా ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే వచ్చే నెలలో పెళ్లి జరుగుతుందని సమాచారం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నానని కీర్తి వెల్లడించింది. మీరు  ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు కీర్తి సమాధానమిస్తూ.. తాను  ఒంటరిగా ఉన్నానని ఎన్నడూ చెప్పలేదు. అయితే, కీర్తి తాను  ఎవరితో  ప్రేమలో ఉందనే విషయాన్ని ఇప్పటికీ వెల్లడించలేదు.  కీర్తి నిర్మాత సురేష్  కుమార్, నటి మేనకా సురేష్ ల చిన్న కుమార్తె.  సినీరంగంలో తల్లి బాటను ఎంచుకున్న కీర్తి తొలి చిత్రం గీతాంజలి. కీర్తి మలయాళంలో మోహన్‌లాల్‌తో నటిగా తన ప్రయాణాన్ని  ప్రారంభించింది.  అతి తక్కువ సమయంలోనే తమిళం, తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  కీర్తి కెరీర్‌లో మహానటి సినిమా చిరకాలం గుర్తుండి పోతుంది.ఈ పాత్ర ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ  అవార్డును తెచ్చిపెట్టింది.

తెలుగులో నేను శైలజ, నేను లోకల్, సర్కారు వారి పాట,  మహానటి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్  లో చెల్లెలి పాత్రలో నటించింది.  గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న  కీర్తి ఇటీవల బాలీవుడ్ లో ఓ సినిమా చేసేంది. బాలీవుడ్ లో పాగా వేసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంతలోనే కీర్తి పెళ్లి వార్త సంచలనం సృష్టించింది. గతంలోనూ  కీర్తి పెళ్లి చేసుకోబోతున్నదంటూ న్యూస్ వచ్చినా అవి గాసిప్స్ గానే మిగిలాయి.

TAGS