PM Emotional : నారా రామ్మూర్తి నాయుడి మృతిపై ఎమోషనల్ అయిన పీఎం.. నారా రోహిత్ కు లేఖ..
PM emotional : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డి సోదరుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయడు ఇటీవల దివంగతులైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమిం చనిపోగా, స్వగ్రామం నారా వారిపల్లెకు భౌతిక కాయాన్ని తరలించి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి సంతాపం ప్రకటించారు. మరికొందరు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. మరికొందరు నేరుగా వెళ్లి పరామర్శించారు.
ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడిని ఫోన్ లో పరామర్శించారు. అలాగే రామ్మూర్తి నాయుడి కుమారుడు నారా రోహిత్ కు ప్రధాని లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధాని రామ్మూర్తి నాయుడు మృతిపై భావోద్వేగానికి లోనయ్యారు. రామ్మూర్తి నాయుడు చనిపోయారని తనకు తెలియగానే తీవ్ర ఆవేదన చెందానని, ఆ లోటు ఎవరూ తీర్చలే నిదని మోడీ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా రామ్మూర్తి నాయుడు వారి ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు.
ప్రజాప్రతినిధిగా సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం రామ్మూర్తి నాయుడు గళం వినిపించారని ప్రధాని కొనియాడారు. ఆయన చేసిన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచు కుంటారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహి తులు, సన్నిహితులకు భౌతికంగా దూరమైనా… ఆయన అందరి హృదయాల్లో ఆయన నిలిచే ఉంటారని అన్నారు. నారా కుటుంబానికి సానుభూతి ప్రటించారు. ఈ కష్ట కాలంలో మీకు మరింత శక్తిని అందించాలని భగవంతుడిని కోరుతున్నానని పేర్కొన్నారు.