Zomoto CEO : ఫుడ్ డెలివరీ బాయ్ గా మారిన జొమోటో సీఈవో కారణం ఏమిటంటే?
Zomoto CEO : ప్రస్తుతం దేశవ్యాప్తంగా జొమోటో ఫుడ్ డెలివరీలో అగ్రస్థానంలో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రోజు కొన్ని లక్షల మంది జొమోటో ద్వారా ఫుడ్ డెలివరీకి ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. ఈ జొమాటోలో అనేక మంది యువకులు పనిచేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. జొమోటో సీఈవో దీపేంద్ర గోయల్ అతని భార్య ఇద్దరు కలిసి గురుగ్రవులో జొమోటో డెలివరీ బాయ్ గా ఒక రోజు పనిచేసే అందరిని ఆశ్చర్యపరిచారు.
ఫుడ్ డెలివరీ బాయ్స్ పడే కష్టాలేంటి ఫుడ్ డెలివరీ చేయడంలో ఏ విధంగా ఉంటుంది. వారు చేసే ప్రయాణం ఎలా ఉంటుంది. డెలివరీ కి ముందు డెలివరీ తర్వాత ఎలా స్పందిస్తారు. ఇలా అనేక రకాల విషయాలను స్వయంగా ఫుడ్ డెలివరీ చేసి దీపేంద్ర గోయల్ దంపతులు తెలుసుకున్నారు. ఈయన చండీగఢ్ లో జన్మించాడు.
ఈయన తల్లిదండ్రులు టీచర్లు దీపేంద్ర గోయల్ 2001 జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో పాస్ అయి ఢిల్లీ ఐఐటీలో సీటు సంపాదించడం ఆ తర్వాత బెన్ అండ్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అతడికి ఒక ఆలోచన వచ్చింది . అక్కడ ఉన్న ఉద్యోగులందరూ ఫుడ్ డెలివరీ కోసం అనేక రకాల కష్టపడుతున్నారు .అప్పుడు దీపేంద్ర తన స్నేహితుడు పంకజ్ తో కలిసి ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోను స్థాపించాడు.
ప్రస్తుతం జొమోటో కొన్ని లక్షల మందికి రోజు ఫుడ్ డెలివరీలు చేస్తుంది. ఒక చిన్న ఆలోచన ఆయనని ఈ రంగంలో కోటీశ్వరుడుని చేసింది. దాదాపు రెండు రెండు లక్షల కోట్ల వ్యాపారానికి పైగా ఈ జొమాటో యాప్ సాగుతోంది. ఇంతటి వ్యాపారవేత్త కోటీశ్వరుడైన దీపేంద్ర గోయల్ మళ్లీ డైరెక్ట్ ఫుడ్ డెలివరీ చేయడం అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.