Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వందకుపైగా విమానాలు ఆలస్యం

Delhi: ఢిల్లీలో వాయు నాణ్యత పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. ప్రస్తుతం వాయు నాణ్యత సూచీ 428 (సీవియర్ కేటగిరీ)గా నమోదైంది. ఇది వరుసగా ఐదో రోజు కొనసాగుతోంది. ఈ పరిణామం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం చూపుతోంది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు వల్ల దృశ్యాలు కేవలం 800 మీటర్ల వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. దీనివల్ల 107 విమానాలు ఆలస్యమయ్యాయి. మరో 3 విమానాలు రద్దయ్యాయి.

ఫ్లైట్ రాడార్ సంస్థ ప్రకారం, ఈ పరిస్థితి కారణంగా ప్రయాణికులకు అప్రమత్తం చేయాలని ఢిల్లీ ఎయిర్ పోర్టు, విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని అనేక మానిటరింగ్ స్టేషన్లలో వాయు నాణ్యతా సూచీ 400 పైగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

TAGS