Today (07/12/2023)horoscope in Telugu:నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు
Today (07/12/2023) horoscope in Telugu:డిసెంబర్ 7 గురువారం 12 రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఓ రాశి వారు కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఇంతకీ ఆ రాశి ఏంటీ?..ఈ రోజు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి ఒక సారి చూద్దాం.
ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సమయం వృధా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవారాధన మానవద్దు.
ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టదేవతా సందర్శనం ఈ రాశివారికి శుభాలని కలిగిస్తుంది.
ధృడమైన మనసుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్ర నామ పారాయణ శుభాలను కలిగిస్తుంది.
శుభ ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటి వారి సాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.
మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.
మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరతాయి. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచి తూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.
ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ బేధాలు వస్తాయి. దుర్గాస్తోత్రం చదవాలి.