KTR : మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?: కేటీఆర్

KTR

KTR

KTR : రూ.25 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేయవచ్చని, మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లకు వెళ్లకుండా మూసీ ప్రక్షాళన చేయవచ్చన్నారు. 31 ఎస్టీపీలు పూర్తయితే మూసీలో స్వచ్ఛమైన నీరు వస్తుందని.. ఎస్‌ఎన్‌డీపీ ప్రారంభం వల్ల వృథా నీరు నిల్వ ఉండదన్నారు. మూసీ ప్రక్షాళనపై అంతకుముందు తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన కేటీఆర్‌.. మళ్లీ తమ ప్రభుత్వం వస్తే ఎస్‌ఎన్‌డీపీ రెండో దశను ప్రారంభించేవారన్నారు.

మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ‘కేసీఆర్, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తామని రేవంత్ అంటున్నారు. గతంలో ఇలా అన్న వాళ్లే తెలంగాణలో లేకుండా పోయారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే’ అని స్పష్టం చేశారు.

TAGS