Chandrababu : ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన.. కేంద్రమంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు

Chandrababu
Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర సమస్యలపై ఆర్థిక మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపు ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న టీడర్ షిప్ సమ్మిట్ లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అక్కడ రెండు రోజుల పాటు ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.