Dharmendra Pradhan : రానున్న నాలుగేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ: ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan : రానున్న మూడు నాలుగేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, గడిచిన పదేళ్లలో అంకుర సంస్థలు చాలా పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ ఐఎస్ బీలో జరిగిన ఇన్ సైట్ ఫోరమ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉందన్నారు. ఇక్కడ చదువుకునేవారి అభివృద్ధికి ఐఎస్ బీ కృషి చేస్తోందని, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లలో 46 శాతం భారత్ లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2047 వరకు భారత్ కు అమృతకాలమని, దేశాన్ని ప్రథమ స్థానంలో ఉంచడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని చెప్పారు. దేశాన్ని స్కిల్ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి వెల్లడించారు.

TAGS