Good debut : అరంగేట్రం బాగున్నా.. అదృష్టం బాగోలేదా..?
Good debut: రంగుల ప్రపంచంలో తను ఒకరిగా ఉండాలని అనిపించకుండా ఉంటుందా? అందులో కొందరు సక్సెస్ తో దూసుకెళ్తుంటే.. మరికొందరు ఫెయిల్యూర్స్ తో వెనకే ఉండిపోతారు. వచ్చిన అవకాశంను నిలబెట్టుకొని రాణించగలిగిన నటులు అరుదుగా కనిపిస్తారు. అందులో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం సాహసమనే చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీసర్ రికార్డులను తిరగరాసిన సినిమాలో నటించిన హీరోయిన్ కు మారో అవకాశం దక్కకపోవడాన్ని ఎలా చూడాలి? ఆమె దురదృష్టమా.? లేక చేతకాని తనమా.? ఈ ఉపోద్ఘాతం అంతా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి. కేజీఫ్ 1, కేజీఎఫ్ 2 రెండు భాగాల్లో అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడికి మరో అవకాశం దక్కలేదు.
కేజీఎఫ్ లో నటించిన యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియాలోని వివిధ భాషా ఇండస్ట్రీల్లో వారికి గుర్తింపు దక్కింది. కానీ శ్రీనిధికి మాత్రం మరో అవకాశం రాలేదు. రీసెంట్ బక్సాఫీస్ హిట్ గా నిలిచిన దేవరలో పెద్ద ఎన్టీఆర్ పాత్రకు హీరోయిన్ గా నటించిన శృతి మరాఠే పేరు కూడా సగటు ప్రేక్షకుడికి తెలియదంటే ఆశ్చర్యం కలుగకమానదు.
దేవర విజయం గంపగుత్తగా హీరో ఎన్టీఆర్ ఖాతాలో పడిపోతుంది. కానీ ఆ పాత్రకు హీరోయిన్ గా చేసిన నటి పేరు మాత్రం బయటకురాలేదని చెప్పాలి. సప్త సాగరాలు దాటి అంటూ సైలెంట్ గా వచ్చి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్న రుక్మిణి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది.
వీరు తమ మొదటి అడుగుతోనే వెండి తెరపై ముద్ర వేసుకున్నారు. బాక్సాఫీస్ మోత మోగించినప్పటికీ వారికి అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో అరంగేట్రం బాగున్నా.. అదృష్టం లేకుండా పోయిందే అంటూ ఈ ముద్దుగుమ్మల అదృష్టంపై సినీ అభిమానులు జాలి చూపుతున్నారు.