Audience : ప్రేక్షకుల నాడీ పట్టడం ఎలా..?

Audience

Audience Pulls

audience : చూసే వాడు లేకుంటే.. తీసేవాడు ఎలా ఫీలవుతాడు..? ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్దల పరిస్థితి ఇలానే ఉంది. ప్రేక్షకుడి నాడిని పట్టుకోవడంలో తరుచూ వీరు విఫలం అవుతున్నారు. ప్రేక్షకులు చిత్రంగా మారుతున్నారు. ఏ స్టోరీపై ఇంట్రస్ట్ పెడతారో.. ఏ స్టోరీ నచ్చదో స్పష్టంగా తెలియడం లేదు. టీజర్ రిలీజ్ టైములో ఎలా డిసైడ్ అవతారన్నది కూడా చెప్పలేకపోతున్నారు. రొటీన్, రొద సినిమాలు ఇష్టపడడం లేదని తెలిసిందే కదా.. డిఫరెంట్ మూవీలు వచ్చినా స్పందించడం లేదు. పెద్ద హీరోను కూడా పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా వచ్చిన బచ్చన్ సినిమానే పక్కన పెట్టారు.. అదే కొంచెంగా రొటీన్ స్టోరీతో వచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ కు మంచి కలెక్షన్ ఇచ్చారు. సినిమాను దాని లెక్క మేరకు చూస్తే మంచిగానే ఆదరించారు.

గమ్మత్తేంటంటే.. అమరన్ కు మంచి ఓపెనింగ్స్, క, లక్కీ భాస్కర్ కు డీసెంట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. క థ్రిల్లర్ జానర్ కనుక ఆ మాత్రం ఇచ్చారు అనుకుందాం. దుల్కర్ కోసం లక్కీ భాస్కర్ కు, సాయిపల్లవి కోసం అమరన్ కు మంచి ఓపెనింగ్ ఇచ్చారనుకుందాం. మరి కంగువ సంగతేంటి? దానికి మంచి బజ్ ఉంది. సూర్య కోలివుడ్ కే కాదు.. టాలీవుడ్ కు కూడా నచ్చిన హీరోనే. పైగా భారీ సినిమా, డిఫరెంట్ సబ్జెక్ట్ మరి దాని వైపు ప్రేక్షకుడు ఎందుకు తొంగి చూడలేదు? మట్కా వస్తోంది. పక్కా డిఫరెంట్ సినిమా, పీరియాడిక్ సబ్జెక్ట్, మెగా కుటుంబం హీరో, ఎంతో కొంత తెలిసిన దర్శకుడు. ఇక పబ్లిసిటీకి లోటే లేదు. మరి ఎందుకు జనం టికెట్ విండో కు తక్కువగా రియాక్ట్ అవుతున్నారు?

కల్కి వచ్చిన వెంటనే వచ్చిన సినిమాలకు రాలేదు.. పెద్ద సినిమాలకు డబ్బులు పెట్టేసారు కదా.. అనే ఆన్సర్ ఉంది. దేవర తర్వాత కాస్త గ్యాప్ ఉన్నా జనం వచ్చారు. ఇప్పుడు ఏమనుకోవాలంటే, జనం రాబోయే పుష్ప 2కు డబ్బులు దాచుకుంటున్నారేమో అనుకోవాలి.

ఒక వేళ మట్కా, కంగువకు మంచి మౌత్ టాక్ వస్తే.. థియేటర్ వైపు వస్తారేమో? తర్వాత రావడం సంగతి పక్కన వుంచితే.. ముందు ఎందుకు టర్న్ అవడం లేదు? ఎన్ని ఈక్వేషన్లు చూడాలి ఇలా అయితే. బ్యానర్.. కాస్టింగ్.. జానర్.. దర్శకుడు.. ఇలా అన్నీ కలిపి సినిమా చేయాలంటే అందరి వల్లా అవుతుందా..? టాలీవుడ్ ఎటు వెళ్తోంది అన్నది కాదు.. జనాల మైండ్ సెట్ ఎలా రీడ్ చేయాలన్నదే ఇప్పుడున్న అతిపెద్ద పజిల్.

TAGS