Minister Komati Reddy : లగచర్ల ఘటన.. నిందితులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టం: మంత్రి కోమటిరెడ్డి
Minister Komati Reddy : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ‘‘లగచర్ల ఘటనలో ప్రణాళిక ప్రకారమే కలెక్టర్ పై దాడి చేశారు. కేటీఆర్ తో స్థాని్ మాజీ ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడినట్లు రికార్డులు ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. నిందితులను వదిలిపెట్టం. కేసులు చుట్టుముడుతున్న వేళ, ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులు ఈ ఉదంతానికి ఒడిగట్టారు. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్టు కావాల్సిందే. అరెస్టయితే యోగా చేస్తా.. బయటికొచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ విషయమై కేంద్రమంత్రితో మాట్లాడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు’’ అని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.