Bonus : బోనస్ కావాలా నాయనా? ఆఫీసుకు రావాల్సిందే
bonus : దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. ఖర్చు తగ్గింపులో భాగంగా సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఇచ్చే బోనస్‌ను 20 శాతం నుంచి 40 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తొలి త్రైమాసికంలో 70 శాతం వరకు వేరియబుల్ పే ప్రకటించిన కంపెనీ ఈ త్రైమాసికంలో కోత పెట్టింది. జూలై – సెప్టెంబర్ మధ్య, జూనియర్ స్థాయి ఉద్యోగులకు 70-100 శాతం వరకు, సీనియర్ ఉద్యోగులకు 20-40 శాతం, ఇతరులకు 100 శాతం వరకు వేరియబుల్ అలవెన్సులు ఇవ్వబడ్డాయి.
వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ కోత విధించినట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసు నుంచి పనిచేసే వారికి కంపెనీ వేరియబుల్ అలవెన్సులు ఇస్తోంది. దీంతో కార్యాలయానికి వచ్చి పనిచేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 70 శాతం మంది ఉద్యోగులు ఆఫీసు నుంచే పనిచేస్తున్నారని కంపెనీ గత జూలైలో ప్రకటించింది. అయితే రతన్ టాటా మరణానంతరం టెక్కీలకు ఇది నిజంగా షాకింగ్.