Sanju Samson : సంజు శాంసన్ సెంచరీ.. సౌతాఫ్రికాపై భారత్ సూపర్ విక్టరీ
సంజు శాంసన్ కు తిలక్ వర్మ (33), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (21) పరుగులతో మద్దతుగా నిలిచారు. సంజు శాంసన్ 10 సిక్సులు, ఏడు ఫోర్లతో మొత్తం 50 బంతుల్లో 107 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒకదశలో స్కోరు 250 పరుగులు దాటిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సంజు ఔటైన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. హర్దిక్ 2 పరుగులకే వెనదిరగ్గా.. మిగతా బ్యాటర్లు కూడా స్పీడ్ గా ఆడలేకపోయారు. దీంతో భారత్ తన మొదటి ఇన్సింగ్స్ ను 202 పరుగులకు ముగించి సౌతాఫ్రికాకు 203 టార్గెట్ ను పెట్టింది.
కాగా సౌతాఫ్రికా ఓపెనర్ కెప్టెన్ మార్కమ్ మొదటి ఓవర్ లో అర్షదీప్ బౌలింగ్ రెండు బౌండరీలు వరుసగా బాదాడు. కానీ ఆ నెక్ట్స్ బంతికే అవుట్ కావడంతో సౌతాఫ్రికా వికెట్ల పతనం కొనసాగింది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా బ్యాటర్లు ఎవరూ తాము అనుకున్నట్లు ఆడలేకపోయారు. ఇండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఇద్దరు చెరో మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీసి రాణించారు.
టీ 20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేయడం భారత క్రికెటర్ గా మొదటి వ్యక్తి గా సంజు శాంసన్ నిలిచాడు. కాగా ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకు రీలే రోసో, మెకాన్, ఫిల్ సాల్ట్ లు ఈ ఘనత సాధించారు. సంజు శాంసన్ ఫుల్ ఫామ్ అందుకోవడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.