Husband and wife : దాంపత్యం నిలబడాలంటే భార్యాభర్తలు ఇలా చేయండి..
Husband and wife : దాంపత్య జీవితం నిలబడాలంటే భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం గౌరవించుకోవాల్సిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య చాలా జంటలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలనే ధోరణితో వ్యవహరిస్తుండడంతో చాలా కాపురాలు విడాకులకు దారి తీస్తున్నాయి. దాంపత్య జీవితం అందంగా సాగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు
చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాకి వానలా మారి అగాధాలను సృష్టిస్తున్నాయి. అవి లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడి నుంచి మానసిక ,ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అన్యోన్య దాంపత్యం కొనసాగాలంటే బాధ్యతలు ,క్రమశిక్షణ తో పాటు సరసాలు కూడా భార్య భర్తల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తాయని నిపుణులు చెబుతున్నారు
ఈ విషయమై కాన్సస్ వర్సిటీ 15వేల మంది మీద ఈ అధ్యయనం చేసి పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించింది. దంపతుల మధ్య జరిగే సరదా సంభాషణలు, సరసాలు, దాంపత్య బంధాన్ని మెరుగుపరుస్తాయట.
ఉదయాన్నే దంపతులిద్దరూ కలిసి కొన్ని పనులు చేయడం ద్వారా భార్యభర్తల మధ్య బంధం మరింత బలంగా మారుతుందట. రాత్రివేళ త్వరగా నిద్ర పోవడం వేకువ జామున మేల్కోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ఈ అధ్యయనం చెబుతోంది.
ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూతమ వృత్తి గత జీవితంలో బిజీగా మారిపోయారు. అయితే చాలా మంది భార్యభర్తలు ఉద్యోగాల వేటలో పడి తమ భాగస్వాములపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఎన్నో సర్వేలు వెల్లడించాయి. ఇక మహిళలు ఇంటికే పరిమితమైతే ఇల్లు సర్దుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పెద్ద వాళ్లకు సపర్యలు చేయడం లో సమయం గడిచిపోతుందట.
దీంతో వారిని ఓదార్చేవారు లేక సహనం కోల్పోతున్నారంట. ఇది కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచడంలో ఒక కారణమవుతుందంట. ఆఫీసులు వ్యాపారాలు అని తిరిగే భర్తలు కొంత సమయం భార్యకు ఇంటి పనుల్లో సహాయపడితే మహిళలు ఎంతో ఉప్పొంగిపోతారట. ఇంటి పనులు వారికి కొంత సహాయ పడితే ఆ భార్యాభర్తల బంధం మరింత స్ట్రాంగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు
ఎదుటివారి లోపాలను ఎత్తిచూపకుండా వాటిని సానుకూలంగా చెబుతూ మార్చుకోమని సూచిస్తే ఆ బంధం అన్యోన్యంగా ఉంటుందని సర్వేలో వెల్లడైంది.
ఇక ఉద్యోగాలు చేసే భార్యలను భర్తలు స్వయంగా ఆఫీస్ వద్ద దించడం ఇంటికి వచ్చే సమయంలో పికప్ చేసుకోవడం కూడా వారి మధ్య బంధాన్ని మరింత బరోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తీరిక సమయంలో ఉదయం లేదా సాయంత్రం ఇద్దరు కలిసి భాగించి వెళ్లడం ద్వారా అటు మానసికంగా వీరు శారీరకంగా ఇద్దరికీ ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు వారి మధ్య బంధం బలోపేతం చేయడానికి మంచి మార్గంగా నిలుస్తుంది.