Harish Shankar : ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇదొక్కటి.. రానాకు హరీశ్ శంకర్ రిప్లై

Harish Shankar

Harish Shankar

Harish Shankar: ఐఫా అవార్డుల వేడుక ఇటీవలే అబుదాబిలో జరిగిన  సంగతి తెలిసిందే. ఈ అవార్దు కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టైల్‌ ను అనుకరిస్తూ అ వేడుకకు యాంకర్లుగా రానా దగ్గుబాటి, తేజ సజ్జా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. వారిద్దరూ జోకులు వేసుకుంటూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖుల మీద కూడా పంచ్ లు వేశారు. దీంతో అందులోని కొన్ని సన్నివేశాలకు వాళ్లు వేసిన కౌంటర్లు ఆయా హీరోల అభిమానులు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఫెయిల్యూర్‌ గురించి రానా వేసిన పంచ్‌ మాస్‌ మహరాజా రవితేజ అభిమానులను బాధ పెట్టినట్లే కనిపిస్తోంది. దీనిపై ఓ నెటిజన్‌ పోస్ట్ కూడా పెట్టాడు.

మిస్టర్‌ బచ్చన్‌  దర్శకుడు హరీష్‌ శంకర్‌ ను ట్యాగ్‌ చేస్తూ అభిమాని రవితేజతో మరో సినిమా తీసి అభిమానులు కాలర్‌ ఎగరేసేలా చేయాలని కామెంట్‌ చేశాడు. అభిమాని కామెంట్‌ కు డైరెక్టర్‌ హరిష్‌ శంకర్‌ స్పందిస్తూ.. ఇలాంటివి ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇదొకటి.. అన్ని రోజులూ ఒకేలా ఉండవు.. నాకైనా ఎవరికైనా అంటూ వేదాంత ధోరణిలో అభిమానికి రిప్లై ఇచ్చాడు. సోషల్ మీడియాలో హరీశ్ శంకర్‌ మాములాగానే మంచి టెంపర్‌ మీద ఉంటాడు. ఇక తన మీద పంచ్‌ వేస్తే మళ్లీ తిరిగి గట్టిగా కౌంటర్‌ ఇచ్చేస్తాడు.. అలాంటిది మిస్టర్‌ బచ్చన్‌ ఫెయిల్యూర్‌ తర్వాత పంచ్‌ వేసే స్లైల్‌ కూడా మార్చి దూకుడు కూడా తగ్గించేశాడు. అయితే రానా పంచ్‌ లకు హరిష్‌ శంకర్‌ కాస్త నిరాశతోనే వున్నాడని, అదికూడా ఐఫా అవార్డుల వేడుకలో తన సినిమా గురించి మాట్లాడిన రాణాకు ఏం చెప్పకుండానే అభిమానికి రిప్లై ఇస్తున్నట్లు.. తమ్ముడు అంటూ సాప్ట్ గా స్పందించాడు దర్శకుడు హరీశ్ శంకర్‌.

TAGS