Jagan : కూటమి పాలనపై జగన్ ఫైర్… సూపర్ సిక్స్ లంటే ఇవేనా? అని నిలదీత

Jagan

Jagan

Jagan : ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మళ్లీ యుద్ధం మొదలైందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు నిలుగా ఉన్న ప్రతిపక్ష నేత జగన్ ఒక్కసారిగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కూటమి ప్రభుత్వంలోని వైఫల్యాలను ఒక్కొక్కటిగా లేవనెత్తుతూ చీల్చిచెండాడారు. అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. ఇంత అధ్వాన్న పరిస్థితులు స్వాతంత్ర్యం వచ్చాక ఇదే మొదటిసారి అని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవేనా అంటూ ధ్వజమెత్తారు. సూపర్ సిక్సులంటూ ప్రతి పక్షన్ ను మోసగించారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రతీ వ్యవస్థను నీరుగార్చారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఐదు నెలల్లో మహిళలపై 31 అత్యాచారాలు జరిగాయంటే రాష్ట్రంలో మహిళా భద్రతా ఏవిధంగా ఉందో అర్ధమవుతుందంటూ ధ్వజమెత్తారు. ఎడుగురు బాధితులు చనిపోవడం రాష్ట్రానికే సిగ్గుచేటన్నారు. తెనాలిలో రౌడీషీట్ ఉన్న టీడీపీ నాయకుడు అమ్మాయిపై దాడి చేసి చంపేశాదని, ఇంత కన్నా ఆధారాలు ఏం కావాలని విమర్శించారు. 18 ఏళ్ల అమ్మాయిపై లైంగికదాడి చేసి సజీవ దహనం చేస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీసీ కూటమి ప్రభుత్వం మౌనమే మరిన్ని హత్యలు, అత్యాచారాలు, దోపిడికి అమారమిచ్చినట్లు అవుతున్నదని ఆరోపించారు. అధికార పార్టీ నేతల పిల్లలు దాడులకు తగబడడానికీ ప్రజలు అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. దసరా పండుగరోజు అత్తాకోడళ్లపై చేసి జరిగితే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, అది తమ రాష్ట్రంలో కాదన్నట్లుగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నదని నిప్పులు చెరిగారు.
అధికార పార్టీని ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అక్రమ కేసులు పెట్టి వేధించి, ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నడని ఆరోపించారు. ప్రశ్నించేవారిని తొన్ని పెట్టడం కాదని, ప్రశ్నలకు సమాధానాలు, పరిష్కారం కావాలన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది నాకేదో మంచి జరుగుతుందనీ తప్పు, హత్యలు, అత్యాచారాలు కోసం కాదని విమర్శనాస్త్రాలు సంధించారు. సూపర్ సిక్స్ ల పేరిట ప్రతి సెక్షన్ను మోసం చేసి చంద్రబాబు రాక్షపానందం పొందుతున్నారని జగన్ విమర్శించారు. జగన్ వేసిన విమర్శలపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
TAGS