President of America : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు
President of America : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ఫలితాలు వెలువడతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హారిస్ కంటే అధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని ఈ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కమలా హారిస్ పై ట్రంప్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ అద్భుతం
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్స్ లో అద్భుతాలు చేశారు. ట్రంప్ నార్త్ కరోలినాతో పాటు జార్జియాలో విజయం సాధించారు. అదే సమయంలో, మిగిలిన 5 రాష్ట్రాలైన అరిజోనా, మిచిగాన్, నెవాడా, పెన్సిల్వేనియాతో పాటు విస్కాన్సిన్లలో, అతను తన ప్రత్యర్థి కమలా హారిస్ కంటే చాలా ముందంజలో ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ చివరి దశకు చేరుకుంది. డోనాల్డ్ ట్రంప్ 248 ఎలక్టోరల్ ఓట్లతో మెజారిటీ స్థానానికి చేరువవుతున్నారు. అదే సమయంలో తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్తి కమలా హారిస్ 214 ఓట్లతో వెనుకబడిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ గా గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం.