High Court : మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ
High Court : ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ హత్య కేసులో వైసీపీ తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈరోజు (మంగళవారం) బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
కాగా, 2020లో ఆంధ్రజ్యోతి తుని రూరల్ విలేకరి కే.సత్యనారాయణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ హత్యలో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రమేయం ఉందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు లేకుండా చేశారు. దీనిపై న్యాయవాది అయిన సత్యనారాయణ సోదరుడు, ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రాజా ప్రమేయం ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో రాజా పిటిషన్ వేశారు.