Uranium : యురేనియం తవ్వకాలు రద్దు చేయాలి.. రోడ్డుపై ఆందోళనతో నిలిచిన రాకపోకలు

Uranium
Uranium : కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఈదుల దేవరకొండ స్టేజ్ వద్ద రైతులు, ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో కర్నూలు-బళ్లారి రహదారి మార్గంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో కప్పట్రాళ్ల రక్షిత అడవుల్లో యురేనియం తవ్వకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కప్పట్రాళ్లలో అధికారుల సమావేశాన్ని రైతులు, ప్రజలు బహిష్కరించారు. యురేనియం తవ్వకాలు చేపడితే నష్టపోతామంటూ వివిధ గ్రామాల ప్రజలు కొన్ని రోజులుగా వరుస ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.