Sarpanch : మాజీ సర్పంచుల పోరుబాట.. ఎక్కడికక్కడ అరెస్టులు
Former sarpanch : పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు హైదరాబాద్ కు వచ్చి ఓ హోటల్ లో సమావేశమయ్యారు. అనంతరం హోటల్ బయటకు వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఏడాదిగా తిరుగుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. మాజీ సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంతి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎంను కలిసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.