Hundred crore club : వంద కోట్ల క్లబ్ లోకి టాలీవుడ్ ప్లాఫ్  హీరో..  ఇదేం అరాచకం స్వామి?

Hundred crore club

Hundred crore club

Hundred crore club : కొంత కాలంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. అయితే ఇక్కడ చిన్న, పెద్దా అనే తేడాలు లేకుండా భారీ హిట్లు కొడుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన హను-మాన్  పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గతేడాది నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా కూడా వంద కోట్ల మార్క్ ను అందుకుంది. అయితే ఈ రెండు సినిమాలు మాత్రం ఆయా హీరోల మార్కెట్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టి తీసినవే.  ఆ హీరోల కోణంలో వారికి అవి భారీ బడ్జెట్ సినిమాలే. అయితే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడంతో వంద కోట్ల మార్కును అందుకున్నాయి.

2021 లో వచ్చిన కార్తికేయ-2 కూడా హీరో నిఖిల్ ను వందకోట్ల హీరోగా చేర్చింది. కార్తికేయ-2 కూడా ముందు తెలుగులో విడుదలైన ఆ తర్వాత పాన్ ఇండియా లో రిలీజై సంచలన విజయం సాధించింది. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ను చిత్రం లాల్ సింగ్ చద్దా  రిలీజైనా, దేశమంతా కార్తికేయ-2కే పట్టం కట్టారు.

ఇప్పుడు మరో తెలుగు హీరో కూడా వంద కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు.  అయితే ఈ హీరో గత చిత్రాలన్నీ ప్లాఫ్ కావడం గమనార్హం. మంచి కంటెంట్ తో ఏడాది పాటు తన సమయం అంతా కేటాయించిన తీసిన సినిమా ఇటీవల విడుదల కాగా తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అదే కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా. అక్టోబర్ 31న విడుదలైంది.తొలుత పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నా  సాధ్యం కాలేదు. మిగతా భాషల్లో పెద్ద హీరోల సినిమాలు ఉండడం, థియేటర్లు దొరక్క ఆ ఆలోచనను విరమించుకున్నాడు. కేవలం తెలుగులోనే రిలీజ్ చేశాడు. సూపర్ హిట్ టాక్ తో సినిమా దూసకుపోతున్నది. వంద కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్లాఫ్ హీరోగా ఒక్క సారి వంద కోట్లు కొల్లగొట్టడమేంటి స్వామి.. ఇదేం అరాచకం అంటూ నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు.

TAGS