Sharmila : నాకు ప్రాణభయం ఉంది.. సెక్యూరిటీ కల్పించండి ప్లీజ్ : షర్మిల

Sharmila

Sharmila

Sharmila : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల విషయంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిలకు వాటా విషయంలో వైఎస్ జగన్ కోర్టు మెట్లెక్కారు. దీంతో ఈ ఫ్యామిలీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేగింది. జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో వైసీపీ, కాంగ్రెస్ నేతలు సైతం పరస్పరం విమర్శలు చోటు చేసుకుంటున్నారు. ఇక వైఎస్ షర్మిలపై పలువురు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు సైతం చేస్తున్నారు. అన్న ఆస్తుల కోసం షర్మిల కుట్రలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. జగన్ అండగా ఉంటామంటూ షర్మిల విషయంలో ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో వైఎస్ షర్మిలకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలాగే షర్మిల, విజయమ్మకు తమకు ప్రాణ హాని ఉందని తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.

షర్మిలకు అండగా నిలుస్తూ ఇటీవల పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత తమదేనన్నారు. ఆ నాయకుడి సొంత సోదరి తన ప్రాణాలకు రక్షణ కావాలంటున్నారని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. అయితే జగన్ సంపాదించిన ఆస్తులన్నీ వైఎస్ ఆర్ హయాంలో సంపాదించినవే. ఆయన అధికారంలో ఉండగా క్విడ్ ప్రో కింద సంపాదించిన ఆస్తులే కాబట్టి అక్రమాస్తుల కేసులు ఉండే సంగతి తెలిసిందే. తండ్రి ఆస్తుల్లో వాటా అడుగుతుందంటే ఆమె కూడా ఆమె పై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆస్తుల కోసం చంపుకోవడాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆస్తుల కోసం తమను కూడా చంపేస్తారని షర్మిల భయపడుతుందని తెలుస్తోంది. అందుకే సెక్యూరిటీ కోరుతోంది.

TAGS