Elon Musk : ఎలాన్ మస్క్ స్పెర్మ్ ఆఫర్ ను తిరస్కరించిన మహిళలు..?
Elon Musk : ఎలన్ మస్క్ తన స్మెర్మ్ ను దానం చేసి తన డీఎన్ఏను విస్తరించుకోవాలని తరుచూ చెప్తుంటాడు. అయితే గతంలో ఆయన 12 మంది పిల్లలకు జన్మనిచ్చానని అందులో కొందరు వేర్వేరు మహిళలతో కలిగారని కథనాలు ఉన్నాయి. అయితే తాజాగా మరో బిడ్డను కనేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇవ్వడానికి ముందు ఇటీవల ఆర్ఎఫ్‌కే జూనియర్ సహచరిగా ఉన్న అటార్నీ నికోల్ షానహన్ కు స్పెర్మ్ డొనేట్ చేసేందుకు టెక్ బిలియనీర్ ముందుకొచ్చారు. మస్క్, షానహాన్ ఇద్దరూ ఇప్పుడు ట్రంప్ శిభిరంలో ఉన్నారు. మస్క్ ఆఫర్ పై షానహాన్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
మస్క్, షానహాన్లకు 2022 నుంచి రిలేషన్ ఉందన్న వార్తలు ఉన్నాయి. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ను పెళ్లాడిన తర్వాత మస్క్ తో ఎఫైర్ ను షానహాన్ ఖండించారు. టెస్లా సీఈఓ తన డీఎన్ఏను వ్యాప్తి చేయాలని అనుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సిలికాన్ వ్యాలీలో జరిగిన ఒక విందులో ఒక జంట తాము గర్భం ధరించేందుకు ఇబ్బంది పడుతున్నామని చెప్పగా.. తనకు ఎక్కువ మంది పిల్లలున్నారని ఆయన వారితో చెప్పారు. వారికి కూడా తన స్పెర్మ్ ను దానం చేయాలని మస్క్ అనుకున్నట్లు అమెరికా మీడియా కథనాలు రాసింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి అయిన తనకు 12 మంది పిల్లల ఉన్నారని, అందులో ముగ్గురు వేర్వేరు మహిళలతో కలిగారని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ ముగ్గురు మహిళల్లో ఒకరు న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారన్నారు. ఆమె మస్క్ బిడ్డను అతని అప్పటి ప్రియురాలు గ్రిమ్స్ అదే ఆసుపత్రిలో ప్రసవించింది.
మస్క్ తన అసాధారణ మార్గాల గురించి కూడా నోరు మెదపడం లేదు. ఒక రోజు అంగారక గ్రహంపై జనావాసం గురించి బహిరంగంగా మాట్లాడిన స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, సమాజంలో తన డీడిఎన్ఏను వ్యాప్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని నమ్ముతున్నాడు.