Liquor shops : లిక్కర్ షాపుల సరికొత్త ఆఫర్.. ఎగబడుతున్న తాగుబోతులు..

Liquor shops

Liquor shops

Liquor shops offers : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌.. ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్‌ బై చెప్పి కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త పాలసీ అమల్లో భాగంగా ప్రైవేట్‌ వ్యక్తులు మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే, లిక్కర్‌ అమ్మకాలు పెంచుకునేందుకు మద్యం వ్యాపారులు, వైన్స్ నిర్వాహకులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మందు బాబులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చే దివాళి బోనంజా ఆఫర్ ప్రకటించారు.

కేవలం మీరు మద్యం బాటిల్ కొనండి.. అన్నీ తామే సమకూరుస్తాం అంటూ బోర్డుల మీద బోర్డులు పెడుతున్నారు. ఒక్క మద్యం బాటిల్ తీసుకుంటే ఒక గుడ్డు, గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితం అంటూ ఆఫర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించి బ్యానర్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. చూసే వాళ్లు దీన్ని ఆసక్తికగా గమనిస్తున్నారు.

ఇక మహిళలు ఇదెక్కడి విడ్డూరమని నోరెళ్లబెడుతున్నారు. మందుబాబులకు దీపావళి పండుగ ఒక రోజు ముందుగానే వచ్చిందని సంబురాలు చేసుకుంటున్నారు. మొత్తంగా లిక్కర్‌ అమ్మకాలు పెంచుకునేందుకు మందు బాబులను ఆకర్షించేందుకు బార్లు, వైన్‌ షాపుల యజమానులు కొత్త ప్లాన్‌ వేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ అత్యంత దారుణంగా ఉండడంతో మద్యం అమ్మాకాలు మందకోడిగా జరిగేవి. పైగా ఎక్కువగా కల్తీ మందు దొరికేది. దీంతో మద్యం బాబుల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీలో భారీ మార్పులు తీసుకువచ్చారు. దీని ద్వారా అన్ని బ్రాండ్లను అమ్ముకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

TAGS