Selfie : ప్రాణం మీదికి తెచ్చిన సెల్ఫీ..నాలా ఎవరూ చేయొద్దంటూ హితబోధ
Selfie sarada : సోషల్ మీడియా ప్రభావం చాలా మందిని సెల్ ఫోన్లకు బానిసలుగా మారుస్తు్న్నది. ఓ దశలో వారేం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునే దాకా సెల్ఫోన్లతోనే కాలం గడుపుతున్నారు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా వారేం చేస్తున్నారో వాట్సప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లో అప్ డేట్ పెడుతున్నారు. ఏం తింటున్నాం.. ఎక్కడికి వెళ్తున్నాం.. అనేది సెల్ఫీలతో అప్ డేట్ ఇస్తు్న్నారు. కర్ణాటకకు చెందిన ఓ యువతి ఇలా సెల్ఫీ మోజుతో ప్రాణం మీదికి తెచ్చుకుంది. వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా జలపాతంలో కొట్టుకుపోయింది. ఇక లేదనుకున్న ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో రెస్క్యూ టీం సాహసించి యువతి ప్రాణలను కాపాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
కర్ణాటకకు చెందిన హంస గౌడ తన స్నేహితురాలితో కలిసి మందార గిరి హిల్స్‌కు వెళ్ళింది. వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడింది. కానీ మొబైల్ తో సెల్ఫీ తీసకుంటుండగా ఆ యువతి ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. రెస్య్యూ టీమ్ ఎంత గాలించినా ఆమె ఆనవాళ్లను కనిపెట్టలేకపోయింది. ప్రాణాలకు తెగించి రెస్య్యూ టీమ్ 20 గంటల పాటు నిరంతరంగా శ్రమించింది. అన్ని గంటల పాటు ఆమె వాటర్ ఫాల్స్ నీటిలోనే బండరాళ్ల మధ్య చిక్కుకోవడంతో ప్రాణాలరచేతిలో పట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడిపింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఆమెను కాపాడగలిగారు. ఆ సమయంలో తాను ప్రాణ భయంతో విలవిలలాడానని, సెల్ఫీ మోజులో పడి తనలా ఎవరూ చేయొద్దని ఆ యువతి అనుభవం నేర్పిన గుణపాఠంతో అందరికీ హిత బోధ చేసింది.