IT Serve Synergy Summit : లాస్ వెగాస్ లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్.. విశిష్ట అతిథిగా మంత్రి నారా లోకేష్, పాల్గొన్న డాక్టర్ జైగారు

 

IT Serve Synergy Summit

IT Serve Synergy Summit

IT Serve Synergy Summit : అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో  ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌ ప్రారంభం అయింది. ఈ సమ్మిట్ లో ఆంధ్ర ప్రదేశ్  ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏపీలో పెట్టుబడులకు గల అనుకూల అంశాలను ఈ సమ్మిట్‌ వేదికగా… ఈ సమ్మిట్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ వివరించారు. ఈ సమ్మిట్‌ ప్రాంగణంలో పలువురు పారిశ్రామిక వేత్తలను సైతం మంత్రి లోకేష్ కలిశారు. అలాగే ఈ సమావేశానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి, రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సిఈఓ క్లారా షియాలతో సైతం మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.

ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్‌ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలసి పనిచేయాలని అన్నారు. అలాగే ఈ ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ లో యూ బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొన్నారు. ఆయన సమ్మిట్ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ గారిని కలిశారు. వారిద్దరు ఏపీ పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు. అలాగే మరికొందరు పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలను డాక్టర్ జై గారు కలిశారు.