Synergy 2024 : కన్నుల పండువగా కొనసాగుతున్న ‘సీనర్జీ 2024’.. మంత్రి నారా లోకేష్ తో డాక్టర్ జై గారు..

Synergy 2024

Synergy 2024

IT Serve Synergy 2024 : ఐటీ సర్వ్ అలయన్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని లాస్ వెగాస్ లోని నిర్వహించిన ‘సినర్జీ 2024’ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. టెక్ నిపుణులతో పాటు పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దాదాపు 3000కు పైగా సభ్యులు ఇందులో పాల్గొనేందుకు తమ పేరును నమోదు చేసుకున్నారు. 28వ తేదీ నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు 30వ తేదీతో ముగుస్తాయి.

సినర్జీ 2024 పరిశ్రమ నిపుణులు మాత్రమే కాకుండా, భవిష్యత్తును రూపొందించే ట్రయల్‌బ్లేజర్లు, దూరదృష్టి గల స్పీకర్‌ లైనప్‌ ఉంటుంది. విభిన్న శ్రేణి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, వీరు కొత్త కొత్త ఆవిష్కరణలను నడిపించే సంచలనాత్మక ఆలోచనలు చేస్తారు. సాంకేతికత, వ్యాపారం, అంతకు మించిన తెలివైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు ‘సినర్జీ 2024’ తోడ్పాడు అందజేస్తుంది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్తలు, ఐటీ నిపుణులతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ప్లాటినం సభ్యుడిగా కొనసాగుతున్న యూ బ్లడ్ యాప్ ఫౌండర్, గ్జినాన్ ఇన్ఫో టెక్ సీఈఓ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి కార్యక్రమంలో పాల్గొన్నారు.  నారా లోకేశ్ తో మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు, వాటిని ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై కూలంకుశంగా చర్చించారు.

జగదీష్ బాబు మాట్లాడుతూ దూరదృష్టి గల నేత చంద్రబాబు నాయుడు అని. ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం అభివృద్ధిని వేగవంతం చేసిన గొప్ప దార్శనికుడు చంద్రబాబు అన్నారు. ఇప్పుడు యంగ్ లీడర్ లోకేశ్ అవసరం రాష్ట్రానికి ఉందని చెప్పారు. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి శాఖ నిర్వర్తించడంపై జగదీష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

Read more : IT Synergy 2024 : అట్టహాసంగా సినర్జీ 2024 ప్రారంభం..