old clothes : పాత దుస్తులతో కాసుల వర్షం.. భారీ లాభాలు తెచ్చిపెట్టే ఇండస్ట్రీ ఇదే..

old clothes

old clothes

old clothes : ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్‌కు మంచి సక్సెస్ ఉంది. ప్లాస్టిక్‌, గాజు గ్లాసుల వంటి రీసైక్లింగ్ వ్యాపారాల గురించి విని ఉంటారు. వాడిపడేసిన దుస్తులను కూడా రీసైక్లింగ్ చేయచ్చని తెలుసా.? పాత దుస్తులతో రీసైక్లింగ్‌ ఎలా చేస్తారు..? అసలు రీసైక్లింగ్ చేసిన దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారు. ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం టెక్స్‌టైల్ వేస్ట్‌లో 8.5 శాతం భారత్‌ నుంచే ఉంటుంది. దాదాపు ప్రతీ ఏటా 7800 కిలో టన్నుల టెక్స్‌టైల్ వేస్టే ప్రొడ్యూస్ అవుతోంది. వీటిని రీస్లైకింగ్ చేయడం ద్వారా భారీ లాభాలు వస్తాయి. దుస్తుల రీసైక్లింగ్‌కు ఎలాంటి యంత్రాలు కావాలి, పాత దుస్తులను ఏం చేయాలో తెలుసుకుందాం.

పాత దుస్తుల రీసైక్లింగ్‌తో టాయిల్స్ తయారు చేయవచ్చు. ఇప్పుడు ఇది  ట్రెండీ బిజినెస్. పాత దుస్తుల రీసైక్లింగ్ కోసం పెద్ద గోదాం కావాల్సి ఉంటుంది. ముందుగా వీటిని తుక్కుగా మార్చే మిషిన్స్‌ కావాలి. టాయిల్స్ తయారీలో క్రష్‌డ్‌ గ్లాస్ కావాలి. పాత దుస్తులను హోల్‌సేల్‌ గా విక్రయించే సంస్థలు చాలానే ఉన్నాయి. టాయిల్స్ తయారీలో పొటాష్‌ పౌండర్‌ అవసరం అవుతుంది. ఇవన్నీ ఇండియా మార్ట్‌ లో ఆన్‌లైన్ వేదికగా అందుబాటులో ఉన్నాయి.

క్లాత్‌ రీసైక్లింగ్‌ మిషిన్‌ ధర రూ. 2 లక్షల వరకు ఉంటుంది. దుస్తులను ఫైబర్‌లా మారుస్తుంది. ఆ తర్వాత బ్లెండర్‌ మిషిన్‌ కావలి. బ్లెండర్‌ మిషన్‌లో ఫైబర్‌తో పాటు క్లష్డ్ గ్లాస్‌, పొటాష్‌ పౌడర్‌ వేసి మిక్స్‌ చేయాలి. దీని ధర రూ. 75 వేలు ఉంటుంది. వీటితో పాటు టాయిల్స్ తయారీ మిషన్‌ కూడా కావాలి. దీని ధర రూ. లక్ష వరకు ఉంటుంది. బ్లెండర్‌ మిషన్‌ నుంచి వచ్చిన మెటీరియల్‌ టాయిల్స్ తయారీ మిషిన్‌లో వేస్తే టాయిల్ రెడీ అవుతుంది. ఈ లెక్కన చూస్తే సుమారు రూ. 8 లక్షల్లో వ్యాపారం ప్రారంభించవచ్చు.

లాభాలు..
ఒక్క టాయిల్ తయారీకి సుమారు రూ. 11 ఖర్చవుతుంది. మార్కెట్లో ఒక్కో టైల్‌ ధర రూ. 70 వరకు ఉంటుంది. హోల్‌సేల్‌ గా రూ. 40కి విక్రయించినా రూ. 30 లాభం ఏటూపోదు. ఇలా చూస్తే బిజినెస్‌తో భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

TAGS