Rachel Gupta : మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ విజేతగా రాచెల్ గుప్తా
Rachel Gupta : భారతీయ మోడల్ రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. కాగా మొదటి సారి ఈ టైటిల్ ను గెలుచుకున్న ఇండియన్ ఉమెన్ గా రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం లారా దత్తాతో సమానం ఆయా ప్రపంచ పోటీల్లో ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్న మహిళగా నిలిచింది.
ఇన్ స్టాగ్రాంలో ఈవెంట్ నిర్వాహకులు రాచెల్ గుప్తాకు అభినందనలు తెలుపుతూ జీవితంలో కలలన్నీ నిజం చేసుకోవాలని కోరుకుంటున్నామని పోస్టు చేశారు. ఈమె 2022 లో మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ కిరీటాన్ని కూడా గెలుచుకుంది.
ఆమె ఇన్‌స్టాగ్రాంలో మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను ఈ ముద్దుగమ్మ కలిగిఉంది. కాగా చాలా మంది మహిళలు వారి కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ కొన్ని సార్లు విజయాలు సాధిస్తారు. మరి కొన్ని సార్లు విజయాలు సాధించలేకపోతారు. అలాంటి వారందరికీ తాను అండగా ఉంటానని మాట ఇచ్చింది.
రాచెల్ గుప్తా జనవరి 24, 2004న భారతదేశంలోని పంజాబ్‌లోని జలంధర్‌లో రాజేశ్ అగర్వాల్ జెన్నిఫర్ గుప్తా దంపతులకు జన్మించారు. వీరిద్దరూ వ్యాపార వేత్తలు కాగా రాచెల్ కు రియా గుప్తా అనే చెల్లెలు ఉంది. రాచెల్ గుప్తా ఇలాంటి అనేక పోటీల్లో పాల్గొని విజయాలు సాధించింది. మిస్ గ్రాండ్ ఇండియా 2024 కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇలా తన అంద చందాలతో ఎక్కడ అడుగుపెట్టిన విజయాలు సాధిస్తూనే ఉంటుంది.