Kaleshwaram : కాళేశ్వరం డీపీఆర్ ను కేసీఆర్ ఆమోదించారు: మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు

Kaleshwaram DPR : కాళేశ్వరం అంశంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట రిటైర్డు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మరోసారి హాజరయ్యారు. గతంలో రెండుసార్లు విచారణకు హాజరైన ఆయన తాజాగా సోమవారం మరోసారి కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ వద్దకు నల్లా వెంకటేశ్వర్లు పలు కీలక ఆధారాలు సమర్పించారు. డీపీఆర్ కు కేసీఆర్ ఆమోదం తెలిపిన డాక్యుమెంట్లు, అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్లు, జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల వివరాలకు సంబంధించి తన వద్ద ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్లు, మినట్స్ దస్త్రాలను కమిషన్ కు అందజేశారు. విచారణ సందర్భంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై పీసీ ఘోష్ ప్రశ్నించగా కాళేశ్వరం డీపీఆర్ ను నాటి సీఎం కేసీఆరే ఆమోదించారని వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే కాళేశ్వరం డిజైన్లను కేసీఆర్ ఫైనల్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపమే కారణమా..? మూడు బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా 3 బ్యారేజీల్లో నీరు నింపాలని అప్పటి ప్రభుత్వాధినేత చెప్పారని తెలిపారు. మేడిగడ్డ 7వ గేట్ కుంగుబాటుకు ఆపరేషన్, మెయింటనెన్స్ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు.

TAGS