YCP : ప్రజా వ్యవహారాలపై ప్రశ్నించడం మానేసిన వైసీపీ కారణం అదేనా..?

YCP

YCP

YCP : ఘోర పరాజయం నుంచి ఇప్పటికీ వైసీపీ కోలుకోవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే  ఇంకా సతమతమవుతోందని వాటి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఈ ఓటమి వారిని కుంగదీసింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అయినా గత వైసీపీ చేసిన అప్పులతో ఆర్థిక మాంద్యం, విజయవాడలో వరదలు, తదితరాల నుంచి మెల్ల మెల్లగా బయటపడుతోంది.

దీంతో ప్రజల్లో ఏదో ఒక మూల ప్రభుత్వం అసంతృప్తి ఉందని తెలుస్తోంది. అయితే, దీన్ని జగన్, వైసీపీ నేతలు అందపుచ్చుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీని అంతర్గతంగా బలోపేతం చేయడంపై జగన్ దృష్టి సారించారు. అయితే ఈ విపత్కర సమయంలో వైసీపీని మరింత బలహీనపరిచేందుకు షర్మిలను జగన్ వ్యతిరేక పక్షాలు ఒక సాధనంగా ఉపయోగించుకున్నాయి.

అన్నా, చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదం తీవ్రరూపం దాల్చగా, షర్మిల వైఖరిపై జగన్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. షర్మిల చర్యల వల్ల జగన్ తృటిలో జైలు శిక్ష నుంచి తప్పించుకున్నారని, తన సోదరి కుట్రలను గుర్తించకపోతే ఆయన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేవారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇన్నాళ్లుగా షర్మిల వ్యాఖ్యలపై ప్రత్యేకంగా స్పందిస్తున్న వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని ఫోకస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ హయాంలో షర్మిలకు న్యాయమైన వాటా దక్కిందని, ఆమెకు అన్యాయం జరగలేదని వారు చెబుతున్నారు. ఈ వివాదంపై వైసీపీ అగ్రనేతలతో రోజూ ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిక్కుల్లో చిక్కుకున్న ఆ పార్టీ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీగా ఫెయిల్ అవుతూ వస్తోంది.

TAGS