Hindus in Bangladesh : బంగ్లాదేశ్ లో హిందువుల భారీ ర్యాలీ.. జనసంద్రమైన రోడ్లు
Hindus in Bangladesh : బంగ్లాదేశ్ లో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది మైనార్టీలు వీధుల్లోకి రావడంతో జనసంద్రంగా మారాయి. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. చటోగ్రామ్ లో సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అలాగే మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. ఈ మేరకు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తాత్కాలిక ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచారు. వాటిని నెరవేర్చే వరకు వీధుల్లో తమ నిరసన కొనసాగుతుందని కొందరు హిందూ ఉద్యమకారులు తెలిపారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొద్ది నెలల క్రితం బంగ్లాలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దాంతో అప్పుడు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికారాన్ని కోల్పోయింది. హసీనా రాజీనామా చేసి, దేశాన్ని వదిలి భారత్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికలు జరిగే వరకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది.