Telugu movie: 2024 హయ్యెస్ట్ గ్రాసర్ తెలుగు సినిమా ఇదేనా?
Telugu movie : 2024 జనవరిలో రిలీజ్ చేసేందుకు టాప్ హీరోలు కూడా పోటీ పడ్డారు. కానీ పోటీ పడినంత స్థాయిలో సినిమాలు ఆడలేదు. కొన్ని సినిమాలైతే రిలీజ్ అయినట్లు కూడా తెలియకపోవడం గమనార్హం. ఆ తర్వాత కూడా పెద్ద హీరోల సినిమాలు రిలీజైన పెద్దగా సక్సెస్ లు రాలేదనే చెప్పాలి. అదే సమయంలో ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలను పట్టించుకున్నోళ్లు లేరు. మరో రెండు నెలల్లో 2024 ముగియనున్నది. ఇప్పటి వరకు హిట్టయిన సినిమాలు ఎన్ని, హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాలేంటో తెలుసుకుందాం.
ఈ ఏడాది టాప్ హీరోలు విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో కొన్ని డిజాస్టర్ కాగా, కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే భారీ హిట్లు అనిపించుకున్నాయి.
జనవరిలో గ్రాండ్ గా రిలీజైన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు సాధించడంలో చతికిల పడింది. గుంటూరు కారం రిలీజైన మరుసటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ అనూహ్య విజయం సాధించింది. కంటెంట్ కరెక్టుగా ఒక చిన్న సినిమా టాప్ హీరోల కలెక్షన్లను సైతం వారంలో అధిగమించగలదని నిరూపించింది హనుమాన్. తక్కువ బడ్జెట్ లో హై ఎండ్ గ్రాఫిక్స్ రాబట్టడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ అనిపించుకున్నాడు.
ముందుగా మే9 విడుదల చేస్తామని ప్రకటించిన రెబల్ స్టార్ కల్కి మూవీ జూన్ 27కు షిఫ్ట్ అయ్యింది. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి వెయ్యికోట్ల జాబితాలో నిలిచాడు. ఇప్పటి దాకా వాయిదాలు పడుతూ వచ్చిన ఎన్టీఆర్ దేవర దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ 15 రోజుల ముందు (సెప్టెంబర్27న) విడుదల చేసి సూపర్ హిట్టు కొట్టాడు ఎన్టీఆర్. తొలిసారి ఎన్టీఆర్ 500 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప-2 డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయ్యింది. నెల క్రితం వరకు ఈ సినిమా 2024 లో వస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు డిసెంబర్ 5న పుష్ప-2 విడుదల కాబోతున్నది. మరి డిసెంబర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కల్కి కలెక్షన్లను అధిగమిస్తాడా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకైతే పుష్ప-2 ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 900 కోట్లు అని తెలుస్తున్నది.
ఇక చిరంజీవి, బాలకృష్ణ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. విశ్వంభర సినిమాను ముందుగా దసరాకు విడుదల చేస్తారని భావించినా, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సంక్రాంతికి రిలీజ్ డేట్ ను మార్చకుంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసెంబర్ లో వచ్చేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఇక డిసె
తెలుగులో భారీ హిట్లు ఆ సినిమాలేనా?
ఈ ఏడాది తెలుగు నుంచి భారీ విజయాలు సాధించిన వాటిలో ముందున్నది ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర, హనుమాన్ మాత్రమే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లో భారతదేశంలోనే ప్రభాస్ నెంబర్ వన్ గా నిలిచాడు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కు దేవరతో ఓ భారీ హిట్టు పడింది.
ఇక అసలైన విజయం హనుమాన్ దే
ఇక ఈ ఏడాది విడుదలైన సంచలన విజయాల్లో హనుమాన్ దే అగ్రస్థానం. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 350 కోట్లకు పైగా వసూలు చేసింది.