Faria : ఫరియాను ఆల్ ఇన్ వన్ గర్ల్ అంటూ పొడిగిన స్టార్ హీరోయిన్..

Faria

Faria

Faria : యంగ్ హీరోయిన్లలో ట్రెండింగ్ లో ఉన్న నటీమణి శ్రీలీల. అందం అభినయం కలిసిన శ్రీలీల వేగంగా స్టార్ డం సంపాదించుకుంది. కన్నడ భామ ఇండస్ట్రీకి ‘పెళ్లిసందD’తో ఎంట్రీ ఇచ్చినా తర్వాత చాలా ప్రాజెక్టులకు బుక్ అయ్యింది. అందులో కొన్ని ఫ్లాప్ అయినా శ్రీలీలకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. శ్రీలీలకు సమానంగా ఇండస్ట్రీలోకి వచ్చిన మరో నటి ఫరియా అబ్ధుల్లా. కొవిడ్ టైంలో డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జాతి రత్నాలు సినిమాలో ఫరియా ఆల్ టైం యాక్టింగ్ చేసింది. ఆమె యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారు. కొవిడ్ ముగిసిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేసిన సమయంలో కూడా మంచి కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, ఇటీవల శ్రీలీల ఫరియా అబ్ధుల్లాను మెచ్చుకుంంది. ఫరియా రీసెంట్ సినిమా ‘మత్తు వదలరా 2’లో ‘డ్రామా నక్కో మామా’ సాంగ్ కు ఆమె చేసిన డ్యాన్స్ కు ఫిదా అయ్యిందట శ్రీలీలు. ఇన్ స్టా వేదికగా ఫరియా అబ్ధుల్లాను పొగిడింది. ‘ఆన్-ఇన్-వన్ గర్ల్’ అని రాసుకుంది. సింగర్, లిరిసిస్ట్ మరియు కొరియోగ్రాఫర్‌గా ఆమె నైపుణ్యాలను మెచ్చుకున్నారు.

TAGS