CM Chandrababu : రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్ ఫీల్డ్ రహదారులు: సీఎం చంద్రబాబు

Four green field road

 Four green field road

CM Chandrababu : రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరుగనుందని, 6 ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని, 75 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యు, 23 ప్రాజెక్టులకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నాయన్నారు. మొత్తం 95 ప్రాజెక్టులకు వివిధ సమస్యలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్ ప్రెస్ వేకు సమస్యలు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు 15 రోజుల్లో పర్యావరణ అనుమతులు సాధించాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దాదాపు రూ.18 వేల కోట్లతో పనులన్నీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం జరుగనుందన్నారు. ఎకో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ మారనుందని తెలిపారు. ఆక్వా, హార్టికల్చర్ ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు.

TAGS