KTR : రెండు లక్షల ఉద్యోగాలు కాదు.. ఉన్నవి తీసేస్తున్నారు: కేటీఆర్

KTR

KTR

KTR : రెండు లక్షల ఉద్యోగాలు కాదు.. ఉన్నవి తీసేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికా పోస్టు చేశారు. కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమని, అడ్డగోలు సాకులతో వారిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. హక్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సస్పెండ్ చేసిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

TAGS