Barrelakka:బ‌ర్రెల‌క్క శిరీష‌కు పోలైన ఓట్లు ఎన్నంటే..

Barrelakka:తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు గంట గంట‌కు ఆస‌క్తిక‌రంగా మారుతూ అధికార పార్టీకి వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ సాధించాల‌న్న కేసీఆర్ క‌ల క‌ల‌గానే మిగిలిపోనుంద‌ని ఓట్ల లెక్కింపు స‌ర‌లిలో బ‌య‌ట‌ప‌డుతోంది. అత్య‌ధిక‌ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజ‌లో ఉండ‌గా, బీఆర్ ఎస్ మాత్రం చాలా వ‌ర‌కు వెన‌క‌బ‌డిపోయింది. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల త్రిముఖ పోరులో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వ్య‌క్తి బ‌ర్రెల‌క్క అలియాస్ క‌ర్నె శిరీష‌.

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో పేరున్న పార్టీలు, నాయ‌కుల‌ని మించి వార్త‌ల్లో నిలిచింది. కొల్లాపూర్ నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌ర్రెల‌క్క స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఆమెకు వ‌చ్చే ఓట్ల సంఖ్య ఏంత‌?, ఆమెకున్న విజ‌యావకాశాలు ఏంటీ? అనే దానిపై పెద్ద ఎత్తునే చ‌ర్చ జ‌రిగింది. అంతే కాకుండా హోరా హోరీ పోరులో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌ర్రెల‌క్క పోటీకి దిగ‌డంతో యూత్ చాలా వ‌ర‌కు ఆమెకు స‌పోర్ట్‌గా నిలిచారు. దీంతో బ‌ర్రెల‌క్క సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

త‌ల్లి మ‌ద్ద‌తుతో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా కొల్లాపూర్ నియోజ‌క వ‌ర్గంలో నామినేష‌న్ దాఖ‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. ఈ విష‌యం నెట్టింట వైర‌ల్ కావ‌డంతో యువ‌త‌, విద్యా వేత్త‌లు, నిరుద్యోగులు ఆమెకు అండ‌గా నిలిచారు. దీంతో బ‌ర్రెల‌క్క తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజా ఎన్నిక‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన బ‌ర్రెల‌క్క‌కు ఎంత మంది అండ‌గా నిలిచారు?..ఆమెకు ఎంత మంది ఓటేశారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బ‌ర్రెల‌క్క మాకు ఏమాత్రం పోటీ కాద‌ని, ఆమె వ‌ల్ల ఒక‌టి లేదా రెండు వేల ఓట్లు మాత్ర‌మే అటు ఇటు అవుతాయ‌ని, అంతే త‌ప్ప తాను మాపై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేద‌ని ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ధీమా వ్య‌క్తం చేస్తూ బ‌ర్రెల‌క్క‌ని పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకోలేదు. అయితే ఓటింగ్ ప్ర‌క్రియ ముగిన త‌రువాత ఆరా మ‌స్తాన్ త‌న ప‌ర్వేలో బ‌ర్రెల‌క్క‌కు 10 నుంచి 15 వేల ఓట్లు వ‌స్తాయ‌ని తేల్చి చెప్పారు. అయితే రెండో రౌండ్ ముగిసే స‌మ‌యానికి ఆమెకు కేవ‌లం 735 ఓట్లు మాత్ర‌మే ల‌భించ‌డం గ‌మ‌నార్హం.

TAGS