Drone Show : గిన్నీస్ రికార్డు సృష్టించిన విజయవాడ డ్రోన్ షో
Drone Show : ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రోన్ షో అట్టహాసంగా జరిగింది. విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా జరిగిన ఈ భారీ ఈవెంట్ అత్యాధునిక డ్రోన్ విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రికార్డులు నమోదు చేసి విజయవాడను అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ ప్రదర్శనలను గుర్తించారు. ఏకకాలంలో ఐదు వేర్వేరు విభాగాలలో గిన్నిస్ రికార్డ్‌లను ధృవీకరించారు. రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.
* లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి
* నదీ తీరాన లార్జెస్ట్ ల్యాండ్ మార్క్
* అతిపెద్ద ఏరియల్ లోగో ఆకృతి
* అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి
* డ్రోన్ల సహాయంతో రూపొందించిన అతిపెద్ద ఏరియల్ లోగో
ఈ ఐదు రికార్డులు విజయవాడ డ్రోన్ షోను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. ఈ ఘనతను గిన్నిస్ బుక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఇది కేవలం డ్రోన్ షో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైన సాంకేతిక అభివృద్ధి సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప సందర్భం.
View this post on Instagram