Chandrababu : మాకు జరిగినట్లు ఎవరికీ జరగద్దు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు..
Chandrababu : తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మొదలైంది. ఏడాదితో పాటు ఆశ్వత సభ్యత్వం చేసుకోవాలని, ప్రజలను కూడా టీడీపీ కుటుంబంలో చేర్చాలని చంద్రబాబు నాయుడు నాయకులు, ప్రజా ప్రతినిధులను కోరారు. నిన్న (అక్టోబర్ 18, శుక్రవారం) ఆయన మాట్లాడుతూ గతంలా కాకుండా ఈ సారి సభ్యత్వ బీమా, ప్రమాద బీమాలను పెంచుతున్నట్లు చెప్పారు. మా కుటుంబాన్ని జగన్ రెడ్డి ఎంత హింసించాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, అలా మరో కుటుంబం ఇబ్బంది పడద్దంటే ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడే అందరూ కలిసి కట్టుగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదును ఇప్పుడు వాట్సప్ ద్వారా కూడా చేసుకోవచ్చని, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నట్లు చంద్రబాబు అన్నారు. వాట్సప్ కు సంబంధించి నెంబర్లను కూడా షేర్ చేశారు.