Salman Khan : ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు
Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్ కు గురువారం రాత్రి మెసేజ్ చేశారు. ‘‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్దిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎద్ర్కోవాల్సి ఉంటుంది’’ అని దుండగులు అందులో బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది? మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కునే పనిలో పడ్డారు.
ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటివద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హర్యానాలోని పానిపట్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.