Alcohol : మత్తు దించుతున్న మద్యం ధరలు.. తాగక ముందే షాక్

alcohol

alcohol

alcohol Price : తాము అధికారంలోకి వస్తే రాష్ర్టంలో మద్యం నిషేధిస్తామని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు పెంచి ప్రజలకు షాకిచ్చాడు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీపై విరుచుకుపడ్డాడు. కల్తీ మద్యం అమ్ముతున్నారని,  రేట్లు బాగా పెంచేసి జనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవగా, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం పాలసీని సవరిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు కూడా మద్యం ప్రియులకు షాకిచ్చాడు. రెండు రోజల క్రితం ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు అవుతున్నది.

తక్కువ ధరకు నాణ్యమైన మందు దొరుకుతుందనే గంపెడాశలతో ఉన్న మద్యం ప్రియులు కొత్త విధానంతో బెంబేలెత్తిపోతున్నారు. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ విధిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా చేసింది. డ్రగ్స్ రీహాబిలిటేషన్ కింద మద్యం ల్యాండెడ్ రేట్లపై రెండు శాతం అదనంగా పన్ను విధిస్తున్నది. ఈ పన్ను ద్వారా అదనంగా రూ.100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఇలా వచ్చిన నిధులను డ్రగ్స్ నియంత్రణ, రీహాబిలిటేషన్ కేంద్రాల కోసం ఏపీ సర్కార్ వినియోగించనుంది. ఇక డ్రగ్స్ రీహాబిలిటేషన్ పన్నును అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

మద్యం బాటిల్ ధర రూ.150.50 పైసలు ఉంటే కొత్త పన్ను ప్రకారం రూ.160 వసూలు చేస్తారు.  బాటిల్ ధర రూ.200.050 పైసలు ఉంటే కొత్త పన్ను ప్రకారం రూ.210 దాకా వసూలు చేస్తారు.     నూతన మద్యం విధానం ప్రకారం రూ.99 లకే క్వార్టర్ మద్యం అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఒక్కో క్వార్టర్ కు రూ. 210 చొప్పు వసూలు చేస్తున్నారు  దీంతో మద్యం ప్రియులు ఇవేం రేట్లు అంటూ మండిపడుతున్నారు.

TAGS