Telangana Election Result:ఓట్ల లెక్కింపులో హస్తం జోరు, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ
Revanth reddy:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలట్ లెక్కింపు షురూ అయ్యింది. ఈ నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందుంజలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లీడ్ లో ఉన్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ
మంచిర్యాల , బెల్లంపల్లి లో కాంగ్రెస్ ముందంజ
వేములవాడ కాంగ్రెస్ ముందంజ
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఖైరతాబాద్ లో విజయారెడ్డి ముందంజలో ఉన్నారు
వికారాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముందు ఉన్నాడు
మధిరలో బట్టి విక్రమార్క ముందంజ
ఖమ్మంలో తుమ్మల ముందంజలో ఉన్నారు
నిజామాబాద్ లోని 5 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ ఉండటం విశేషం.
పాలకుర్తిలో కాంగ్రెస్ ముందంజ, ఎర్రబెల్లికి ఎదురీత
బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల్లో ఎదురీత తప్పేటట్టు లేదు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి 738 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొదటి రౌండులో 11,262 ఓట్లకు గాను కాంగ్రెస్కు 6,000, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుకు 5,262 ఓట్లు వచ్చాయి. పాలకుర్తిలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య రసవత్తర పోరు కొనసాగనుంది. చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు వెనుకబడి ఉండటం గమనార్హం.