Food orders : ఫుడ్ ఆర్డర్లు పెడుతున్నారా తస్మాత్ జాగ్రత్త?

Food orders

Food orders

food orders : ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఇంట్లో వంట చేసుకుని తినడం చాలామందికి బద్ధకంగా మారిపోయింది. మరి కొంతమంది ఎక్కువగా జొమాటో , స్విగ్గి లలో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకొని తింటున్నారు. కానీ వారు ఏం పంపిస్తున్నారు. అందులో క్వాలిటీ ఏముంది అది మనం పెట్టిన ఫుడ్ ఆర్డరా లేక వేరే ఏదైనా ఫుడ్ పంపిస్తున్నారా? అది తాజాదేనా అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇలా ఏది పడితే అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా జొమోటో లో ఆర్డర్ ఇచ్చిన సమయంలో ఒక హోటల్కు ఆర్డర్ ఇస్తే మరో హోటల్ వాళ్ళు పికప్ చేసుకొని దానిని పంపిస్తున్నారు. అందులో ఎక్స్ట్రా యాడ్ చేసిన సమయంలో ఒకదానికి బదులు మరొకటి పంపించి నాసిరకమైన ఫుడ్ పంపిస్తూ డబ్బులు ఎక్కువగా కలెక్ట్ చేసుకుని లబ్ధి పొందుతున్నారు.

కానీ కస్టమర్ల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనివల్ల కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక కస్టమర్ తాను పెట్టిన ఆర్డర్ కు బయలు వేరేది ఫుడ్ ఐటెం రావడంతో జమోటో నే నిలదీశాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అక్కడికి తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చాడు? డబ్బులు వాపస్ చేయమని అడిగాడు.

అసలు నేను ఫుడ్ ఆర్డర్ పెట్టిన హోటల్ ఇది కాదు మీరు ఎందుకు పంపించారు అని వారిని నిలదీశారు. అయితే హోటల్ పేరు అలానే చూపిస్తుందని ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఇస్తామని ఆ హోటల్ యజమాని చెప్పడం ఇక్కడ ఆశ్చర్యకరంగా అనిపించక మానదు. ఇలా ఫుడ్ ఐటమ్స్ చాలా మంది బ్రాండ్ హోటల్స్ నుంచి తెప్పించుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ అక్కడ పేరు చూపించడం మాత్రం బ్రాండ్ హోటల్ ఫుడ్ ఇవ్వడం మాత్రం సాదాసీదా హోటల్ నుంచి ఇస్తున్నారు. ఇంతటి మోసానికి పాల్పడుతున్న హోటల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ చేస్తున్నటువంటి భోజన ప్రియులు కోరుతున్నారు. దీని బదులు అక్కడ తినడం మానేస్తే బాగుంటుందని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

TAGS