Nagarjuna Sagar : నాగార్జున సాగర్ కు వరద.. 4 గేట్లు ఎత్తి నీటి విడుదల

Nagarjuna Sagar
Nagarjuna Sagar : ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు 78,286 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 78,286 క్యూసెక్కుల నీటిని అధికారుల దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులు ఉంది. జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 312.045 టీఎంసీలుగా ఉంది. మరో వైపు నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి కొనసాగుతోంది.