Bitcoins : లక్కీ ఫెలో.. 2013లో పోయాయనుకున్న బిట్ కాయిన్లను తిరిగి దక్కించుకున్నాడు

bitcoins

bitcoins

bitcoins : అదృష్టం అంటే ఇతడిదే అని చెప్పాలి. గత 11 సంవత్సరాలుగా క్రిప్టో వాలెట్‌లో ఇరుక్కున్న  3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన బిట్‌కాయిన్‌ను తిరిగి పొందగలిగాడు. ఈ వాలెట్ 2013 నుండి అతడి వ్యాలెట్ క్లోజ్ అయింది. తను పాస్ వర్డ్ మర్చిపోవడంతో తన వాలెట్ ను యాక్సెస్ చేయడం సాధ్యం కాలేదు. భద్రతా పరిశోధకులు పాస్‌వర్డ్‌ను విజయవంతంగా విచ్ఛిన్నం చేయడంతో తిరిగి తన వ్యాలెట్ ను పొందగలిగాడు.  2013లో మైఖేల్ 20 పెద్ద , చిన్న అక్షరాలు, సంఖ్యలతో కూడిన పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి RoboForm అనే జెనరేటర్‌ను ఉపయోగించాడు. భద్రతా కారణాల దృష్ట్యా.. మైఖేల్ పాస్‌వర్డ్‌లను RoboFormతో గుర్తుపెట్టుకోకుండా.. ఎన్‌క్రిప్టెడ్ ఫైల్‌లో ఉంచాడు. ఎన్‌క్రిప్టెడ్ ఫైల్ పాడైపోవడంతో వాలెట్‌లో ఉన్న 43.6 బిట్‌కాయిన్‌లను యాక్సెస్ చేయడానికి అవసరమైన 20-అక్షరాల పాస్‌వర్డ్‌కు మైఖేల్ యాక్సెస్ కోల్పోయాడు.

TAGS