USA president election : అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అలన్ అంచనా ఈసారి నిజమవుతుందా?

USA president election

USA president election

USA president election : అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త,  ఇప్పటి వరకు జరిగిన అధ్యక్ష ఎన్నికలను కచ్చితంగా అంచనా వేసిన అలన్ లిచ్ట్‌మన్ ఈ ఎన్నికల్లో కూడా ఎవరు గెలుస్తారో మరోసారి అంచనా వేశారు. లిచ్ట్‌మన్, అమెరికన్ విశ్వవిద్యాలయంలో విశిష్ట ప్రొఫెసర్. ‘కీ టు ది వైట్ హౌస్’ అని పిలిచే ఒక సర్వే సంస్థను నెలకొల్పారు. 1984 నుంచి అన్ని అమెరికన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను పక్కాగా అంచనా వేస్తున్నది. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో ఈ సంస్థ అంచనా వేసింది.

ఎన్నికల ఫలితాలపై అంచనా ఎలా? ..

1981లో రష్యా భూభౌతిక శాస్త్రవేత్త వ్లాదిమిర్ కెయిలిస్-బోరోక్‌తో కలిసి లిచ్ట్‌మన్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు.  కీలిస్-బోరోక్ అంచనా పద్ధతులను అనుసరిస్తుంటాడు. ఈ సిస్టమ్‌లో మొత్తం 13 కీలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంచనా వేయడంలో కచ్చితమైన రికార్డు ఉంది. అయితే ప్రస్తుత డెమొక్రాట్ (కమలా హారిస్)కి వ్యతిరేకంగా  4 కీలు మాత్రమే ఉన్నాయని, డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు తిరిగి రాలేరని లిచ్‌మన్ అంచనా వేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  గెలిచేది ఎవరు?..

వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలలో కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపుతుందని,  అమెరికా అధ్యక్ష స్థానాన్ని తొలిసారి మహిళ కైవసం చేసుకుంటుందని అలన్ లిచ్ట్‌మన్ అంచనా వేస్తున్నారు .”వైట్ హౌస్ పార్టీ (డెమోక్రాట్లు) కీ 1, ఆదేశ కీని కోల్పోతుందని, ఎందుకంటే 2022లో యూఎస్ హౌస్ సీట్లను కోల్పోయారని  లిచ్ట్‌మన్ చెప్పారు. సిట్టింగ్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయనందున వారు అధికారానికి కీలకమైన కీలకమైన నంబర్ 3 కీలను కోల్పోతారని పేర్కొన్నారు. హారిస్ గురించి ఎవరేమనున్నా ఆమె కొద్దికాలం నుంచి అధ్యక్ష అభ్యర్థిగా వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు. ఆమె ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ స్థాయికి చేరుకోలేదని స్పష్టం చేశారు. విదేశాంగ విధాన వైఫల్యానికి కీలకమైన కీ నం 11ని ఆమె కోల్పోతుందన్నారు.

అమెరికా ఏ దిశలో పయనిస్తోంది?..

“డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కి తిరిగి వస్తారని,  హారిస్ ఓడిపోతారని అంచనా వేయడానికి నాలుగు కీలు తక్కువగా ఉన్నాయన్నారు. కొత్త  ప్రెసిడెంట్ గా మిశ్రమ ఆసియా, ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ ఎన్నికవుతుందని అంచనావ వేస్తున్నారు.  ఇక డెమొక్రాట్‌లకు అనుకూలంగా పని చేసే అంశాల గురించీ  లిచ్ట్‌మన్ వెల్లడించారు. “ఎన్నికల సంవత్సరంలో మాంద్యం లేదు, మూడో పార్టీ ప్రచారాలు కూడా విఫలమయ్యాయి. డెమొక్రాట్‌లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారని పేర్కొన్నారు.

TAGS