KTR : కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్.. 18న సాక్షుల వాంగ్మూలం నమోదు
KTR VS Konda Surekha : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈనెల 18న నాంపల్లి కోర్టు సాక్షుల వాంగ్మాలాన్ని నమోదు చేయనుంది. కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని తెలిపింది. పిటిషనర్ కేటీఆర్ తో పాటు సాక్షులుగా ఉన్న బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, తుల ఉమ వాంగ్మూలాలను నమోదు చేస్తామని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.
తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా కొండా సురేఖ మాట్లాడారంటూ నాంపల్లి కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆ రోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.