Producer Nagavanshi : దేవర కలెక్షన్లపై ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్

Producer Nagavanshi

Producer Nagavanshi

Producer Nagavanshi  : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నైజాం ఏరియా మినహా గతంలో తెలుగు సినిమాలు ఆరు షోలు పడేవి. తర్వాత ప్రింట్ల ఖర్చులు పెరిగిపోవడం, పెద్ద హీరోల సినిమాల రిలీజ్ కుల కూడా పెరిగిపోవడంతో నాలుగు షోలకు పరిమితమయ్యాయి. అయితే టాప్ హీరోల సినిమాలు రిలీజైన సమయంలో మాత్రం తిరిగి ఆరు షోలు వేసేవారు. 1995 తర్వాత పెద్ద హీరోల సినిమాల టికెట్ల రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించాలని పలువురు నిర్మాతలు అప్పటి ప్రభుత్వాలు కోరగా కొంత సానుకూలంగా స్పందించాయి. అయితే ఈ పెంపు తెలంగాణలో మాత్రం అమలు చేయలేదు.  కానీ గత ఐదేళ్లలో మాత్రం తెలుగు సినిమా మార్కెట్ ఏపీలో మాత్రం తీవ్రంగా ప్రభావం చూపింది. సినిమా బాగున్నా కలెక్షన్లు తగ్గాయి.  ప్రత్యేక షోలకు అనుమతులు ముందు ఇచ్చి, చివరి నిమిషంలో రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారడంతో తెలుగు సినిమాలకు కూడా కొంత కలిసి వస్తున్నది. టాలీవుడ్ టాప్ హీరోలందరి సినియాలు దాదాపు పాన్ ఇండియా రేంజ్ లోనే చిత్రీకరిస్తున్నారు. అయితే సినిమా కలెక్షన్లు తీరు మారింది. తొలి వారంలో వసూలు చేసిన మొత్తమ్మీదే సినిమా భవితవ్యం ఆధారపడుతున్నది. పెద్ద హీరోల సినిమాల వసూళ్లకు తొలి వీకెండ్ లో ఢోకాలేదు. కానీ తర్వాత వారం రోజులు వసూలు చేసే మొత్తం మీదే నిర్మాత బయట పడ్డాడా లేదా అనేది స్పష్టమవుతున్నది.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు బాగా ఆడాయి. కానీ టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చి ఉంటే ఆ రెండు సినిమాల రెవెన్యూ మరింత అద్భుతంగా ఉండేదని పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. నందమూరి నటసింహం  బాలకృష్ణ అఖండ,  అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక పుష్ప దేశవ్యాప్తంగా బ్రహ్మండమైన కలెక్షన్లు సాధించగా సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం చుక్కెదురైంది.

దాదాపు ఐదేళ్ల పాటు ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్న తెలుగు సినిమా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నది. ఇందుకు కల్కి, దేవర సినిమాలే ఉదాహరణ. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పెద్ద సినిమాలకు  కొంత వెసులుబాటు దొరుకుతున్నది. అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపునకు సలువుుగా అనుమతులు ఇస్తుండడంతో నిర్మాతకు రెవెన్యూ పరంగా ఉపశమనం కలుగుతున్నది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు ఆంక్షలు లేకపోవడంతో ఏపీలో మంచి వసూళ్లు రాబట్ట గలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు పొందిన నిర్మాత నాగ వంశీ దేవర కలెక్షన్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈరోజు దేవర చిత్రానికి వస్తున్న కలెక్షన్లకు కారణం  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణేనని కొనియాడారు ఎన్టీఆర్ దేవర విడుదల సందర్భంగా తాము టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోల అనుమతుల కోసం  విన్నవిస్తే ఆయన వెంటనే మంజూరు చేయించారని గుర్త చేసుకున్నాడు నిర్మాత నాగ వంశీ.

TAGS