Nagavanshi : వాళ్లు డబ్బులు ఇస్తున్నప్పుడు ఓటీటీకి ఇస్తే తప్పేంటి : నాగవంశీ
Nagavanshi : టాలీవుడ్ సినిమా టికెట్ రేట్లపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నింటితో పోలిస్తే ఒక్క సినిమా రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. మూడు గంటల పాటు ఎంటర్టైన్ చేసేందుకు ఆ మాత్రం టిక్కెట్ రేట్ పెట్టలేరా అంటూ ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఓ కుటుంబంలో నలుగురు కలిసి సినిమాకెళ్తే కేవలం రూ.1500 మాత్రమే ఖర్చవుతుందన్నారు. దేవర సినిమాకు ఒక్క టికెట్ రూ.250 రూపాయలు అనుకుంటే నలుగురికి వెయ్యి రూపాయలు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌కు కలిపి రూ.500 దాకా అవుతుందన్నారు. ఇంతకన్నా తక్కువ ధరలో మూడు గంటల పాటు ఎంటర్ టైన్మెంట్ అందించేది ఎక్కడా లేదన్నారు. అలాగే నాలుగు వారాలకు ఓటీటీలకు సినిమాలను ఇవ్వడంలో తప్పేం లేదన్నారు. వాళ్లు అడినన్ని డబ్బులు ఇస్తున్నారు కాబట్టే నాలుగు వారాలకు రిలీజ్ చేస్తున్నామని.. నాలుగు వారాలంటే తక్కువ సమయమేమీ కాదన్నారు.
అమెరికాతో పాటు ఏపీ తెలంగాణాలో కూడా ఇంత తక్కువ ధరకు ఏక్కడైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందేమో చెప్పండని ప్రశ్నించారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలోనూ దేవర కలెక్షన్స్ గురించి కూడా నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల సంతోషం కోసమే తాము కలెక్షన్స్ వెల్లడిస్తామని తెలిపారు. వారు సంతోషంగా ఉంటే మాకు కూడా హ్యాపీ అని అన్నారు.