Rains in AP : అల్పపీడనం.. ఏపీలో కురుస్తున్న వర్షాలు

Rains in AP

Rains in AP

Rains in AP : బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తిరుమలలో పడుతున్న భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట, కోవూరు, కొదవలూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇబందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. డివిజన్, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పెన్నా నది గట్లు పరిశీలించాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.

TAGS